Best Actors of 21st century: 21వ శతాబ్దం బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్కరు!
ఈ వార్తాకథనం ఏంటి
21వ శతాబ్దం మొదలై 24 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనే అంశంపై 'ది ఇండిపెండెంట్' 60 మంది నటుల జాబితాను విడుదల చేసింది.
2000 సంవత్సరం తర్వాత విడుదలైన సినిమాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను రూపొందించడం గమనార్హం.
ఈ లిస్ట్‌లో ఒకే ఒక్క భారతీయ నటుడికి స్థానం దక్కడం విశేషం. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు ఉన్నా ఈ జాబితాలో వారెవరికి చోటు లభించలేదు.
భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన ఏకైక నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిలిచాడు.
Details
2020లో మృతి చెందిన ఇర్ఫాన్ ఖాన్
41వ స్థానంలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ తన విలక్షణ నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2001లో విడుదలైన 'ది వారియర్' మూవీతో ఆయనకు తొలి బ్రేక్ లభించింది.
తర్వాత హాసిల్, మక్బూల్, ది నేమ్‌సేక్, లైఫ్ ఇన్ ఎ మెట్రో, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమార్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, హైదర్, పీకూ, హిందీ మీడియం, అంగ్రేజీ మీడియం వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇర్ఫాన్ ఖాన్ తన కళ్లతోనే భావాలను వ్యక్తం చేయగలడు అని, అతని నటన కవిత్వంలా ఉండేదని 'ది ఇండిపెండెంట్' ప్రశంసించింది.
2020లో క్యాన్సర్‌తో ఈ నటుడు కన్నుమూసిన విషయం తెలిసిందే.
Details
భారతీయ చిత్రపరిశ్రమకు గర్వకారణం
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మాన్ నిలిచాడు.
2014లో 46 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు. ఆయన తర్వాత రెండో స్థానంలో ఎమ్మా స్టోన్ ఉంది. ఇక వరుసగా డేనియల్ డే-లూయిస్, డెంజెల్ వాషింగ్టన్, నికోల్ కిడ్‌మన్, డేనియల్ కలూయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కొలిన్ ఫారెల్, ఫ్లోరెన్స్ ప్యూ ఉన్నారు.
ఇర్ఫాన్ ఖాన్ ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం భారతీయ చిత్రసీమకు గర్వకారణం. అయితే ఇతర భారతీయ నటుల కోసం ఈ లిస్ట్‌లో స్థానం కల్పించకపోవడం కొంచెం వివాదాస్పదంగా మారింది.