
Tourist Family : భారీ సక్సెస్ సాధించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం కోలీవుడ్‌ను ఊపేస్తున్న చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషన్‌గా మారిపోయింది.
శశికుమార్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించింది.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులను కూడా ఆకట్టుకుంది.
ఇప్పటికే రజినీకాంత్, రాజమౌళి, సూర్య, నాని వంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకంగా సూర్య అయితే చిత్ర బృందాన్ని కలుసుకొని అభినందనలు తెలపడం విశేషం.
Details
జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్
ఈ మూవీ ఇప్పటివరకు రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
దర్శకుడిగా తొలి చిత్రంతోనే అభిషాన్ జీవింత్ ఈ స్థాయిలో విజయం సాధించడంపై పరిశ్రమ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి ఈ క్రేజ్‌తో పాటు ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్దమవుతోంది
'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ సినిమా జూన్ 2న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి తమిళంలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.