
The paradise: షర్ట్ లేకుండా గన్, కత్తితో మోహన్‌బాబు.. 'ది ప్యారడైజ్' నుంచి పోస్టర్ రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
కథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల్ కలయికలో రాబోయే సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise) ప్రేక్షకులను మరోసారి మైమరచనకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అగ్ర నటుడు మోహన్ బాబు కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మోహన్‌బాబు 'శికంజ మాలిక్' (Shikanja Maalik)గా కనిపిస్తూ, షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగర్ కాలిస్తూ రగ్గడ్ లుక్‌లో అందరిని ఆకట్టుకుంటున్నాడు. చిత్రబృందం ప్రకారం, ఆయన పవర్‌ఫుల్ విలన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందబోతున్నాడు.
Details
వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్
ఇక కథానాయకుడు నాని 'జడల్' (Jadal) పాత్రలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ లుక్‌లో స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలకానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతోపాటు మొత్తం 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలు చూస్తే, తిరుగుబాటు, నాయకత్వ లక్షణాలు, తల్లీకొడుకుల అనుబంధం ప్రధానంగా కథను నడిపించబోతోందని తెలుస్తోంది.