Page Loader
Pippa: ఏఆర్‌ రెహ్మాన్‌ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ 
Pippa: ఏఆర్‌ రెహ్మాన్‌ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ

Pippa: ఏఆర్‌ రెహ్మాన్‌ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించిన 'పిప్పా' మూవీ ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించడంతో ఇందులోని పాటలకు మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాలోని 'కరర్ ఓయ్ లౌహో కోపట్' పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ పాట విషయంలోనే వివాదం మొదలైంది. ఈ పాటను కంపోజ్ చేసిన రెహ్మాన్‌‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాట.. ప్రముఖ బెంగాలీ రైటర్‌ నజ్రుల్‌ ఇస్లామ్‌ రాసిన ఇస్లామిక్‌ భక్తి గీతానికి పోలి ఉండటమే కారణం. చివరికి నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్ వివరణ ఇస్తూ ఒక లేఖను విడుదల చేసింది. తాము రైటర్‌ నుంచి పాటకు సంబంధించిన హక్కులను కొన్నట్లు మేకర్స్ చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివరణ ఇచ్చిన నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ఫిల్మ్స్