Tollywood: టాలీవుడ్ హీరోల సత్తా.. ఇండియాలో టాప్-10లో ఆరుగురు మనోళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో టాలీవుడ్ హీరోల ప్రభావం కొనసాగుతోంది. హిందీ సూపర్ స్టార్‌లను వెనక్కి నెట్టుతూ మన తెలుగు హీరోలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్‌లో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రభాస్ నంబర్ వన్ 'బాహుబలి' ఫ్రాంచైజీతో విశ్వవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన హీరోగా నవంబర్ నెలకు కూడా నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకున్నాడు. 'సలార్', 'కల్కి' సినిమాల ద్వారా ప్రభాస్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేశాడు. 2026 సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమాలో ప్రేక్షకులను కొత్త అద్భుతం చూపించడానికి రాబోతున్నాడు.
Details
దళపతి విజయ్
తమిళ హీరో దళపతి విజయ్ టాప్ 10లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల రాజకీయ రంగంలో అడుగు పెట్టిన విజయ్, చివరి సినిమా 'జన నాయగన్' పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్ టాప్ 10లో నాలుగో స్థానంలో నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'పుష్ప' సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు.
Details
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఐవో స్థానంలో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారిగా చేస్తున్న 'వారణాసి' సినిమా కారణంగా ఈ హీరో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మూవీ టైమ్ ట్రావెల్, గ్లోబ్-ట్రాటర్ అంశాలతో రూపొందుతోంది. తమిళ స్టార్ అజిత్ కుమార్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆర్ఆర్ఆర్ హీరోలు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ 10లో ప్రతిష్టాత్మక స్థానాల్లో ఉన్నారు. రామ్ చరణ్ ఏడో స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత 'డ్రాగన్' సినిమా కారణంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
Details
బాలీవుడ్ & పవన్ కల్యాణ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొమ్మిదో స్థానంలో ఉంటే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా టాప్ 10లో నిలిచాడు. 'ఓజీ' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పవన్, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఈ లిస్ట్ చూస్తే, టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగా సత్తా చూపిస్తూ, హిందీ స్టార్‌లను వెనక్కి నెట్టే స్థాయిలో ఉన్నారని స్పష్టమవుతుంది.