LOADING...
The Raja Saab: సంక్రాంతికి 'ది రాజా సాబ్'.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ 
సంక్రాంతికి 'ది రాజా సాబ్'.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ

The Raja Saab: సంక్రాంతికి 'ది రాజా సాబ్'.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజా సాబ్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నెలల తరబడి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వ ప్రసాద్ కీలక అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై జరుగుతున్న చర్చలకు అధికారికంగా స్పష్టతనిచ్చారు.

Details

రాజా సాబ్ బిజినెస్‌పై స్పందన

ఇటీవలి రోజులుగా ప్రభాస్ ఇతర సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో 'ది రాజా సాబ్'ను పోల్చుతూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. దీనిపై స్పందించిన టీజీ విశ్వ ప్రసాద్, మాకు, అభిమానులకు నిజంగా ముఖ్యమైనది థియేట్రికల్ ఇంపాక్ట్ మాత్రమే. మా అతిపెద్ద సినిమా వ్యాపారం చుట్టూ అనవసరమైన సందడి జరుగుతోంది. అంతర్గత ఖర్చులు లేదా సంఖ్యలను మేము బహిరంగంగా చర్చించము. చివరికి థియేటర్లలో సినిమా చూపే ప్రభావమే అసలు తీర్పుని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు.

Details

అత్యధిక నాన్-థియేట్రికల్ వాల్యూ

సినిమా బిజినెస్ అంశంపై మరింత క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడారు. సినిమా విడుదల అనంతరం ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ గణాంకాలను అధికారికంగా పంచుకుంటాం. సినిమా దశలవారీగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం నాన్-థియేట్రికల్ మార్కెట్ సహజమైన దిద్దుబాటు దశలో ఉంది. అయినప్పటికీ, ఈ దశలో అందుబాటులో ఉన్న అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను మా సినిమా సాధించిందని తెలిపారు.

Advertisement

Details

 'ది రాజా సాబ్' విశేషాలు

సుమారు 400 కోట్ల బడ్జెట్తో 'ది రాజా సాబ్' తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు విడుదలైన ఒక పత్రికా ప్రకటనలో, ఈ హారర్ కామెడీ చిత్రానికి కేంద్ర బిందువుగా భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక భారీ 'హవేలీ' ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ రూపొందించిన ఈ సెట్‌ 41,256 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. రిలీజ్ డేట్ 'ది రాజా సాబ్' చిత్రాన్ని మారుతి రచించి, దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ భారీ చిత్రం జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement