LOADING...
The Raja Saab Run time: 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!
'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!

The Raja Saab Run time: 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా, దర్శకుడు మారుతీ రూపొందిస్తున్న భారీ చిత్రం 'ది రాజా సాబ్‌' (The Raja Saab) షూటింగ్‌ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ వివరాలు బయటకు వచ్చాయి. అమెరికాలో ఈ చిత్రానికి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌లో వెల్లడైన సమాచార ప్రకారం 'ది రాజా సాబ్‌' మూవీ నిడివి 3 గంటలు 14 నిమిషాలుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభాస్‌ నటించిన చిత్రాలకు 3 గంటలకు పైగా రన్‌టైమ్‌ కనిపించగా, మారుతీ సినిమాలు మాత్రం సాధారణంగా తక్కువ నిడివితోనే వస్తాయి.

Details

కీలక పాత్రలో సంజయ్ దత్

ఈ కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం కావడంతో పాటు, హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ కథానాయికలుగా నటించగా సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని యూనిట్ భావించినప్పటికీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెరగడంతో జనవరి 9కు వాయిదా వేసింది. 'ది రాజా సాబ్‌' చిత్రం ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మాట్స్‌లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Details

త్వరగా ఫస్ట్ కాపీని సిద్ధం చేస్తాం

నిర్మాణ సంస్థ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేస్తాం. ఈ సంక్రాంతికి అన్ని థియేటర్లలో సందడిని రెట్టింపు చేస్తూ 'రాజా సాబ్‌' ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ విలువలను పెంచుతున్నాడు. మారుతీ ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిత్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది.

Advertisement