LOADING...
The Rajasaab Collections: తొలి రోజే వంద కోట్లు దాటిన 'ది రాజాసాబ్‌' కలెక్షన్స్
తొలి రోజే వంద కోట్లు దాటిన 'ది రాజాసాబ్‌' కలెక్షన్స్

The Rajasaab Collections: తొలి రోజే వంద కోట్లు దాటిన 'ది రాజాసాబ్‌' కలెక్షన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం 'ది రాజాసాబ్‌'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తొలిసారిగా భిన్నమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. చిత్రం విడుదలైన నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్‌ సినిమా కలెక్షన్లపై కీలక ప్రకటన చేశారు.

Details

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్‌ వసూళ్లు

విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలిపారు. ''మొదటి రోజు కలెక్షన్లు వంద కోట్లను దాటుతాయని ముందే అంచనా వేసాం. అయితే అంచనాలను మించి రూ.112 కోట్ల వసూళ్లు రావడం ఆనందంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. కొన్ని మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, 'ది రాజాసాబ్‌' సంక్రాంతి బరిలో నిలిచి హిట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement