LOADING...
Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 
Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2024
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌ దూకుడు ఆగట్లేదు. బాక్సాఫీస్ ముందు ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్స్​ మరో మైలురాయిను దాటింది. ఫస్ట్​ వీకెండ్(నాలుగు రోజులు)లోనే రూ.555 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు ఏడు రోజుల్లో(ఏడో రోజు పూర్తి కాకుండా) ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. ఈ లెక్కన ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ పక్కాగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కల్కి

ఏడో రోజు ఇండియాలో 22.25 కోట్ల నెట్ 

ఇక Sacnilk Entertainment డేటా ప్రకారం ఈ చిత్రానికి ఏడో రోజు ఇండియాలో 22.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఇండియా వైడ్​గా 392.45 కోట్ల నెట్​, 467.9 కోట్ల గ్రాస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల కలెక్షన్​ వివరాలు విషయానికొస్తే ఏడో రోజు రూ. 5 కోట్లు వరకు షేర్ వసూలు చేసిందని తెలిసింది. మిగిలిన అన్ని ఏరియాలూ కలిపి రూ. 15 కోట్ల వరకు కలెక్ట్ చేసిందట. అలా ఈ వారంలోనే రూ. 335 కోట్ల వరకు షేర్ వసూలు చేసి అదరగొట్టింది.

కల్కి

అదరగొట్టిన నటులు

కాగా, భారీ అంచనాల నడుమ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి కల్కి ప్రతిఒక్కరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దిగ్గజ నటులు అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ హాసన్‌ అదరగొట్టేశారు. అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ, మరో పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ అలరించారు. ఇక బౌంటీ ఫైటర్‌ భైరవగా తన కటౌట్​తో ఫ్యాన్స్​ను ఫిదా చేశారు ప్రభాస్‌. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. అలానే రెండో భాగంలో యాస్కిన్‌ పాత్రకు నిడివి ఎక్కువగా ఉండనుందని మూవీటీమ్ చెబుతోంది. అందులో కమల్​ నట విశ్వరూపం మరోసారి కనిపిస్తుందని చెబుతోంది. మొత్తంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.