ఉదయం పూట కనిపించే ఈ లక్షణాల వల్ల షుగర్ వ్యాధిని పసిగట్టవచ్చు
భారతదేశంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది నిశ్శబ్దంగా వచ్చి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనివల్ల గుండె, కిడ్నీ మొదలగు అవయవాల పనితీరుల్లో మార్పు వస్తుంది. మన శరీరంలో చక్కెర శాతం పెరిగినపుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మార్నింగ్ కనిపించే ఈ సంకేతాలు షుగర్ వ్యాధికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. నోరు ఎండిపోవడం: ఉదయం లేవగానే నోరు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగాయని అర్థం చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. లేవగానే విపరీతంగా దాహం వేయడం కూడా డయాబెటిస్ కి సంకేతం కావచ్చని అంటున్నారు. వాంతులు : పొద్దున్న నిద్ర లేవగానే కడుపంతా వికారంగా అనిపిస్తుంటే వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.
మరిన్ని లక్షణాలు
మసక మసగ్గా కనిపించడం: డయాబెటిస్ కారణంగా కంటిచూపు దెబ్బతింటుంది. ప్రారంభంలో ఉదయం పూట మసక మసగ్గా కనిపిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు మళ్ళీ సాధారణ స్థాయికి వస్తే కంటిచూపు మళ్ళీ మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవే కాకుండా పొద్దున్న లేవగానే అలసిపోయినట్లుగా అనిపించడం, మూర్ఛలాంటివి రావడం, పాదాల్లో తిమ్మిర్లు రావడం, మొదలైనవన్నీ రక్తంలో షుగర్ పెరిగిందని చెప్పే సంకేతాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలాసార్లు ఈ లక్షణాలను సీరియస్ గా తీసుకోరు. వీటి తీవ్రత శరీరం మీద ఎక్కువగా ఉండదు కాబట్టి తేలికగా తీసుకుంటారు. కానీ వీలైనంత మేరకు ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు డాక్టర్లను సంప్రదించాలని అంటున్నారు. ప్రపంచ డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో 17శాతం మంది భారతీయులే ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.