Loading...
MALLEPOOLA PALLAKI Film Version: 'థియేటర్లలో దుమ్మురేపిన పాట.. 'మల్లెపూల పల్లకి' వీడియో సాంగ్‌ వచ్చేసింది!

MALLEPOOLA PALLAKI Film Version: 'థియేటర్లలో దుమ్మురేపిన పాట.. 'మల్లెపూల పల్లకి' వీడియో సాంగ్‌ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఇరుముడి' చిత్రంలో విశేష ఆదరణ పొందిన పాట 'మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి..'. అయ్యప్ప స్వామిని స్తుతిస్తూ భక్తులు పాడే ఈ గీతం థియేటర్లలో ప్రేక్షకులను, అయ్యప్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట ఫిలిం వెర్షన్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ చిత్రబృందం తాజాగా 'మల్లెపూల పల్లకి' ఫిలిం వెర్షన్‌ వీడియో గీతాన్ని విడుదల చేసింది. ఇందులో అయ్యప్ప మాలలో ఉన్న రవితేజ.. తోటి భక్తులతో కలిసి హుషారుగా ఆడిపాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివరాలు

సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్

పాటకు అనుగుణంగా రవితేజ సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఇరుముడి' చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు.

ఇప్పటికే థియేటర్లలో విశేష స్పందన అందుకున్న 'మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి..' పాట ఫిలిం వెర్షన్‌ విడుదల కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT