LOADING...
Suriya- Daughter Diya: 17 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కుమార్తె 
17 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కుమార్తె

Suriya- Daughter Diya: 17 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కుమార్తె 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల పిల్లలు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే వారు ఎలా గుర్తింపు తెచ్చుకుంటారు అనేది మాత్రం ముఖ్యమైన విషయం. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో కుమార్తె అడుగుపెట్టింది. సౌత్‌లో అందమైన జంటగా పేరొందిన సూర్య-జ్యోతికలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు దియా, కొడుకు దేవ్. వీరిలో దియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె అందాన్ని చూసి చాలామంది హీరోయిన్‌గా వస్తుందేమోనని ఊహించారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ దియా హీరోయిన్‌గా కాకుండా 'డైరెక్టర్‌గా' ఎంట్రీ ఇచ్చింది.

Details

2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం

దియా రూపొందించిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ పేరు 'లీడింగ్ లైట్'. ఇది సూర్య-జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్‌ ఫిల్మ్‌ బాలీవుడ్‌లో పనిచేస్తున్న మహిళా గాఫర్ల (ఫిల్మ్ సెట్స్‌లో లైటింగ్ పనులు చూసే టెక్నీషియన్లు) జీవితంపై ఆధారపడి ఉంది. హెటాల్ డెడ్దియా, ప్రియాంకా సింగ్‌, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళా గాఫర్ల జీవన ప్రయాణమే ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో ప్రధాన కథాంశం. ప్రస్తుతం ఈ ఫిల్మ్‌ లాస్‌ ఏంజెలెస్‌లోని రెజెన్సీ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది.

Details

గర్వంగా ఉందన్న తల్లిదండ్రులు

ఆస్కార్‌ క్వాలిఫయింగ్ రన్‌లో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్క్రీనింగ్ జరగనుంది. దీని ద్వారా 2026 ఆస్కార్‌ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తమ కుమార్తె దియా ఇంత చిన్న వయసులోనే దర్శకురాలిగా ఆరంగేట్రం చేయడం పట్ల సూర్య, జ్యోతిక గర్వంగా భావిస్తున్నారు. మా కూతురు కేవలం 17 ఏళ్లకే తన కలను నిజం చేసుకుంది. ఇది చూసి మా గుండె నిండిందని భావోద్వేగంతో స్పందించారు.