తదుపరి వార్తా కథనం
Game Changer: 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది.. చరణ్ అదరగొట్టాడు గా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 09, 2024
06:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్, టాప్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్' ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను దేశంలోని పలు థియోటర్లలో రిలీజ్ చేశారు.
RRR మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
ప్రభుత్వ అధికారి పాత్రలో రామ్‌చరణ్ నటన, పవర్‌ఫుల్ సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరింత హైప్ అయింది.
జనవరి 10న ఈ మూవీ విడుదల కానుంది.