Nani: 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత
నాచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్ట్ 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కడుతున్నారు. ఈ సినిమా మొదటి ఐదు రోజుల్లోనే ఇండియాలో రూ.36.75 కోట్లు రాబట్టినట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, ప్రియాంక అరుల్మోహన్, ఎస్.జె. సూర్య, అభిరామి, పి.సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సరికొత్త రికార్డును సృష్టించిన న్యాచురల్ స్టార్ నాని
ఈ చిత్రం 5వ రోజు రూ.3.25 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం మొదటి రోజు (గురువారం) రూ.9 కోట్లు, 2వ రోజు (శుక్రవారం) రూ.5.85 కోట్లు, 3వ రోజు (శనివారం) రూ.9.15 కోట్లు, 4వ రోజు (ఆదివారం) రూ.9.5 కోట్లు రాబట్టింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆంధ్రా, నైజాంలో రూ.34 కోట్లు, కర్ణాటకలో రూ.5.5 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.5 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో రూ.45 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.