hanuman ansh telugu trailer: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ అదిరిపోయింది.. ఎలా ఉందంటే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2026
05:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh Movie). బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న (Hanuman Ansh Telugu Release Date) తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల చేయనుంది. ఈ క్రమంలో సోమవారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ ప్రధాన పాత్రలో నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు.