Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మేజర్ షెడ్యూల్ పూర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేజర్ షెడ్యూల్ విడుదలైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌కు 'IH' అని ఉన్న క్యాప్ ఫోటోను జత చేసింది. 'ఐహెచ్' అని ఎందుకు పెట్టారు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇండస్ట్రీ హిట్ అనే కోణంలో ఈ క్యాప్‌ను జతచేసినట్లు తెలుస్తోంది.