Konidela Pawan Tej: యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో.. మెగా హీరో 'జంట' క్యాప్షన్‌పై టాలీవుడ్‌లో చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హీరో కొణిదెల పవన్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'జంట' ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అయితే కేవలం బ్యాక్‌గ్రౌండ్‌పైనే ఆధారపడకుండా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు యువ హీరో పవన్ తేజ్. తాజాగా ఆయన నటిస్తున్న 'జంట' సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు.
వివరాలు
సినిమా క్యాప్షన్‌తో ఆసక్తికర చర్చ
వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం తాజాగా అమలాపురంలో జరిగింది.
అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం సినిమా క్యాప్షన్. "యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో.." అంటూ పెట్టిన ఈ క్యాప్షన్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఆ రాజ్యం ఏమిటి? రాముడితో కాకుండా రాజ్యంతో హీరో చేసే యుద్ధం వెనుక ఉన్న బలమైన భావోద్వేగం ఏమిటి? అనే ప్రశ్నలు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ క్యాప్షన్ సినిమా కథపై ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
వివరాలు
పక్కా మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా
హీరో పవన్ తేజ్ సైతం సినిమా క్యాప్షన్‌పై స్పందించాడు. ఈ క్యాప్షన్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి తనకు చాలా ఫోన్లు వస్తున్నాయని వెల్లడించాడు.
ఇది పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎమోషనల్ యాక్షన్ డ్రైవ్ అని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'జంట' చిత్ర బృందం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ప్రాంతంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సినిమా షూటింగ్ మొత్తాన్ని అమలాపురం బ్యాక్‌డ్రాప్‌లోనే నిర్వహించనున్నారు.
వివరాలు
రెండు నెలల పాటు అమలాపురంలోనే షూటింగ్
సుమారు రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. పచ్చని పల్లెటూరి వాతావరణంలోకి ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు.
ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ రూపొందించిన కొత్త తరహా యాక్షన్ సీక్వెన్సులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రెండేళ్ల పాటు కష్టపడి ఈ కథను తీర్చిదిద్దినట్లు హీరో పవన్ తేజ్ వెల్లడించాడు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఇతర సినిమా అవకాశాలను సైతం పక్కన పెట్టినట్లు వివరించాడు.