Page Loader
Hometown web series : ఏప్రిల్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'హోం టౌన్' వెబ్ సిరీస్!
ఏప్రిల్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'హోం టౌన్' వెబ్ సిరీస్!

Hometown web series : ఏప్రిల్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'హోం టౌన్' వెబ్ సిరీస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథాంశాలతో, కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు అందిస్తూ ప్రేక్షకులను అలరించేస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. హోం టౌన్ అనే వెబ్‌సిరీస్‌ను ఆహా ప్రేక్షకులకు అందించనుంది. మన ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది.

Details

ఏప్రిల్ 4న స్ట్రీమింగ్

శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల నటించగా, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.