Loading...
DNK Trailer : అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు దొంగతనాలు.. ఆసక్తి పెంచుతున్న 'DNK' ట్రైలర్!
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు దొంగతనాలు.. ఆసక్తి పెంచుతున్న 'DNK' ట్రైలర్!

DNK Trailer : అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు దొంగతనాలు.. ఆసక్తి పెంచుతున్న 'DNK' ట్రైలర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

యువతను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌ల ఉచ్చు.. ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ అంశాలపై ఇప్పటికే ఎన్నో వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే బర్నింగ్ టాపిక్‌ను కథాంశంగా ఎంచుకుని, అందులో కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది టాలీవుడ్ చిత్రం 'DNK'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

వివరాలు

బెట్టింగ్ వ్యసనం.. అప్పుల ఊబిలో హీరో

ఈ రోజుల్లో ఈజీ మనీ సంపాదించాలనే ఆశతో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఎలా బానిసలవుతున్నారో ట్రైలర్‌లో చూపించారు.

బెట్టింగ్ వ్యసనానికి అలవాటుపడిన హీరో.. లోన్ యాప్‌లతో పాటు చివరకు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా అప్పులు చేస్తాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది.

అప్పుల నుంచి బయటపడేందుకు మరో మార్గం కనిపించకపోవడంతో హీరో ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు.

తన స్నేహితుడితో కలిసి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేయాలని ప్లాన్ వేస్తాడు.

వివరాలు

కామెడీతో ఆకట్టుకుంటున్న మౌళి.. అలీ, రజిత సందడి

అయితే వరుస దొంగతనాల వెనుక బీహార్‌కు చెందిన ఓ ముఠా ఉందని పోలీసులు విచారణ ప్రారంభించడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.

'లిటిల్ హార్ట్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్.. అప్పుల పాలైన యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు.

తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా మార్చాడు. హీరోయిన్ సుష్మిత శెట్టి అమాయకపు గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో క్యూట్‌గా ఆకట్టుకుంది.

ఇక హీరో తల్లిదండ్రులుగా నటించిన సీనియర్ నటులు అలీ, రజిత తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. రఘుబాబు, గుండు సుదర్శన్, ప్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ADVERTISEMENT

వివరాలు

కామెడీ, థ్రిల్లర్ అంశాలతో 'DNK'

నేటి జెన్-జెడ్ యువతకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ కథను రూపొందించిన తీరు ట్రైలర్‌లో ఆసక్తిని పెంచుతోంది.

ఒక తీవ్రమైన సామాజిక సమస్యను తీసుకుని, దానికి దొంగతనాల నేపథ్యంలో ఉత్కంఠ, వినోదాన్ని జోడించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.

నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, సింజిత్ యెర్రమిల్లి నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇప్పటికే టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకున్న 'DNK'నవంబర్ 13న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

మరి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT