Yatra Naryasthu: అనుపమ పరమేశ్వరన్ 'పరదా' నుంచి థీమ్ సాంగ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పరదా'. ఈ సినిమాకు 'సినిమా బండి','శుభం' చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా నుంచి 'యత్ర నార్యస్తు పూజ్యంతే...' అనే థీమ్ ఆఫ్ పరదా పాటను మేకర్స్ విడుదల చేశారు.
వివరాలు
కీలక పాత్రలలో దర్శన, సంగీత
ఈ పాటకు వనమాలి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి గానం చేశాడు. గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. సంప్రదాయాల పేరుతో మహిళలను ఎలా అణిచివేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా ఈ సినిమా ప్రస్తావించనుంది. ఆ కట్టుబాట్లను దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అన్న సోషియో డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మలయాళ నటి దర్శన, సంగీత ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లీడ్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్
An ode to every woman’s journey…💫
— Wayfarer Films (@DQsWayfarerFilm) July 17, 2025
The theme of #Paradha,#YatraNaryasthu Lyrical Song OUT NOW 🎼
Telugu – https://t.co/jbqZpf7R48
Malayalam – https://t.co/nhkb14lR6f
Releasing in cinemas August 22nd, 2025. pic.twitter.com/nBEu8mH2A0