Page Loader
Unni Mukundan: హిట్‌ మూవీకి సీక్వెల్‌ లేదు.. అభిమానులకు షాక్‌ ఇచ్చిన హీరో
హిట్‌ మూవీకి సీక్వెల్‌ లేదు.. అభిమానులకు షాక్‌ ఇచ్చిన హీరో

Unni Mukundan: హిట్‌ మూవీకి సీక్వెల్‌ లేదు.. అభిమానులకు షాక్‌ ఇచ్చిన హీరో

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మార్కో' చిత్రాన్ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు నటుడు ఉన్ని ముకుందన్‌ వెల్లడించారు. ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కో 2 ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నించగా, ఆయన ప్రత్యక్షంగా స్పందిస్తూ 'సీక్వెల్‌ ఉండదంటూ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్‌పై వచ్చిన వ్యతిరేకతల కారణంగానే కొనసాగింపు ఆపేసినట్లు వివరించారు. "క్షమించండి... 'మార్కో'కి సీక్వెల్‌ చేయాలన్న ఆలోచనను వదిలేశాను. భవిష్యత్తులో 'మార్కో' కన్నా గొప్ప సినిమాలు తీసుకురావాలని చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హనీఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'మార్కో' చిత్రం ప్రతీకారం నేపథ్యంలో రక్తహింస, యాక్షన్‌తో నిండిన కథను ఆవిష్కరించింది. పెద్ద వ్యాపార కుటుంబం, వారసత్వ పోరు, శత్రువులతో గల సంబంధాలు వంటి అంశాలు చిత్రంలో మేళవించబడ్డాయి.

Details

వంద కోట్లకు పైగా కలెక్షన్లు

2023 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మలయాళంలో పెద్ద హిట్‌ కొట్టింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. తెలుగులోనూ విడుదలై మంచి స్పందన లభించింది. ఇందులో హింస ఎక్కువగా చూపించారన్న విమర్శలు రావడం గమనార్హం. దీనిపై ఉన్ని ముకుందన్‌ గతంలో మాట్లాడుతూ - "మేము ఊహించిన దాని 30 శాతమే స్క్రీన్‌పై చూపించగలిగాం. హింసను ప్రోత్సహించాలన్న ఉద్దేశం లేదు. కానీ అది కథలో భాగంగా ఉంటుంది. ప్రపంచ సినిమా ఇప్పుడు యాక్షన్‌త్మక చిత్రాలవైపు వెళుతోంది. ప్రేక్షకులు కూడా ఎంతో పరిణతి చెందిన వారని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 'మార్కో 2' అఫీషియల్‌గా రద్దు కాగా, ఉన్ని ముకుందన్‌ తనతదుపరి చిత్రాల్లో మరింత మెరుగైన కంటెంట్‌తో ముందుకు రావాలని సంకల్పించినట్టు స్పష్టమవుతోంది.