Telugu movies in january 2026: కొత్త ఏడాది కానుకగా థియేటర్లలోకి వస్తున్న తొలి సినిమాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఏడాదికి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీలు రెడీ అవుతున్నాయి. విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు, ఆసక్తికరమైన సిరీస్‌లు జనవరి తొలి రోజుల్లోనే సందడి చేయనున్నాయి. శ్రీనందు హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం 'సైక్ సిద్ధార్థ'. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా, యామిని భాస్కర్ కథానాయికగా నటించింది. మొదట డిసెంబరు 12న విడుదల చేయాలనుకున్నప్పటికీ, 'అఖండ 2' కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త ఏడాది కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజం, యువతతో బలంగా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రాలు చెబుతున్నాయి.
Details
ఘంటసాల ది గ్రేట్
మహాగాయకుడు ఘంటసాల జీవితాన్ని ఈతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం 'ఘంటసాల ది గ్రేట్'. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో కృష్ణచైతన్య టైటిల్ పాత్ర పోషించారు. మృదుల, సుమన్, సాయికిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ''ఘంటసాల గురించి నేటి తరం తెలుసుకోవాలనే తపనతో ఎంతో శ్రమించి ఈ సినిమా తీశామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం జనవరి 2న విడుదల కానుంది. సఃకుటుంబానాం రామ్ కిరణ్, మేఘ ఆకాశ్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సఃకుటుంబానాం'. హెచ్. మహదేవ గౌడ్ నిర్మాతగా వ్యవహరించారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబరు 19న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జనవరి 1న థియేటర్లలోకి రానుంది.
Details
వనవీర
అవినాశ్ తిరువీధుల హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'వనవీర'. పురాణాల టచ్‌తో సాగే గ్రామీణ నేపథ్య కథతో దీనిని మొదట 'వానర' పేరుతో విడుదల చేయాలనుకున్నారు. అయితే సెన్సార్ సూచనలతో టైటిల్‌ను 'వనవీర'గా మార్చారు. అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి నిర్మాతలు. సిమ్రాన్ చౌదరి కథానాయిక. ఈ చిత్రం కూడా జనవరి 1న విడుదల కానుంది. నీలకంఠ బాలనటుడిగా గుర్తింపు పొందిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన చిత్రం 'నీలకంఠ'. రాకేశ్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నేహా పఠాన్, యష్ణ ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటించారు. జనవరి 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Details
నువ్వు నాకు నచ్చావ్
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నువ్వు నాకు నచ్చావ్' మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. 2001లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జనవరి 1న 4కే వెర్షన్‌లో తిరిగి విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, సుహాసిని, చంద్రమోహన్, సునీల్, ఆశా సైనీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సుధ, హేమ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కోటి సంగీతం ఈ సినిమాను మ్యూజికల్ హిట్‌గా నిలిపింది.
Details
జనవరి 1న రిలీజ్
శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '45'. అర్జున్ జన్య దర్శకత్వంలో సూరజ్ ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ''బతికినన్ని రోజులు సంతోషంగా జీవించాలి'' అనే సందేశంతో రూపొందిన ఈ చిత్రం జనవరి 1న తెలుగులో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.
Details
థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ కొత్త కంటెంట్ ప్రేక్షకులను అలరించనుంది
నెట్‌ఫ్లిక్స్‌లో - 'ఎకో' (మలయాళం) డిసెంబరు 31న, 'స్ట్రేంజర్ థింగ్స్ 5' (తెలుగు డబ్బింగ్) జనవరి 1న, 'లుపిన్ 4' వెబ్‌సిరీస్ జనవరి 1న, 'హక్' (హిందీ) జనవరి 2న స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో - 'సీగే మీ వోస్' ఒరిజినల్ మూవీ జనవరి 2న విడుదల కానుంది. జియో హాట్‌స్టార్‌లో - 'ది కోపెన్‌హెగెన్ టెస్ట్' వెబ్‌సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది. సన్‌నెక్ట్స్‌లో - 'ఇతిరి నేరమ్' (మలయాళం) డిసెంబరు 31న విడుదల కానుంది.