This Week Movie Releases: ఈ ఏడాదికి థియేటర్లలో రిలీజయ్యే చివరి సినిమాలివే.. ఇక ఓటీటీలోనూ వచ్చే మూవీస్‌పై ఓ లుక్కేయండి
ఈ వార్తాకథనం ఏంటి
'ఛాంపియన్' శ్రీకాంత్ కుమారుడైన రోషన్ కథానాయకుడిగా, ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్'. అనస్వర రాజన్ హీరోయిన్. ఫుట్‌బాల్ నేపథ్యంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా, డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంబాల హారర్, సస్పెన్స్, బలమైన భావోద్వేగాలతో నిండి ఉన్న 'శంబాల' మూవీ ఆది సాయికుమార్ హీరోగా, యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కింది. అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబరు 25న విడుదల కానున్న ఈ చిత్రంలో ఊహించని ట్విస్ట్‌లతో కథ సాగనుంది, అని కథానాయకుడు ఆది తెలిపారు.
Details
ఈషా
'నీ శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరమో తెలుసా?'' అని సవాల్ చేస్తున్న 'ఈషా'. అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దండోరా భావోద్వేగాలతో కూడిన వాణిజ్య ప్రధానమైన కథ''గా 'దండోరా' రూపొందింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వంలో, రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల అవుతుంది.
Details
పతంగ్
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'పతంగ్'లో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో, డి. సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా యువతకు కావాల్సిన అన్ని అంశాలతో ఆకట్టేలా రూపొందించబడింది. డిసెంబరు 25న విడుదల. బ్యాడ్ గాళ్స్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో విజయాన్ని అందుకున్న ఫణీ ప్రదీప్ ధూళిపూడి మరో యూత్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ గాళ్స్'ను రూపొందించారు. 'కానీ చాలా మంచోళ్లు' ట్యాగ్‌లైన్‌తో, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల అవుతుంది.
Details
వృషభ
మలయాళ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నందకిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వృషభ'. సామ్రాజిత్ లంకేశ్, షానయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ డ్రామా ఈ చిత్రం డిసెంబరు 25న మలయాళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌లాల్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు.
Details
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే
అమెజాన్ ప్రైమ్ సూపర్ నేచురల్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 22 జీ5 ఏక్ దివానే కీ దివానియత్ (మూవీ) డిసెంబరు 26 నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ హౌస్ (మూవీ) డిసెంబరు 22 గుడ్‌బై జాన్ (మూవీ) డిసెంబరు 24 ప్యారడైజ్ (మూవీ) డిసెంబరు 24 ఆంధ్రాకింగ్ తాలూకా (మూవీ) డిసెంబరు 25 రివాల్వర్ రీటా (మూవీ) డిసెంబరు 26