
upcoming telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వస్తున్న సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్‌తో పాటు ఓటిటిలో పలు సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
థియేటర్ విడుదల 1. మదగజరాజ
ఈ చిత్రంలో విశాల్ కథానాయకుడిగా నటించారు, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు.
సుందర్.సి దర్శకత్వంలో, ఈ చిత్రం తమిళంలో సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
31వ తేదీ నుండి ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. 2. రాచరికం
విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి నటించిన ఈ చిత్రాన్ని సురేష్, ఈశ్వర్ వాసె దర్శకత్వం వహించారు. ఈచిత్రం 31న విడుదల కానుంది. 3. మహిష
కెవి.ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక నటించిన ఈచిత్రం 31న విడుదలవుతోంది.
Details
ఓటీటీలో విడుదలైన చిత్రాలు/సిరీస్‌లు
1. ఐడెంటిటీ
మలయాళంలో విజయవంతమైన మిస్టరీ థ్రిల్లర్. టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో. ఈ చిత్రం 31-01-2025 నుండి జీ5లో తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుంది.
2. పోతుగడ్డ
పృథ్వీ, విస్మయ శ్రీ, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 30-01-2025 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్
లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్) - జనవరి 31 - ది స్నో గర్ల్ 2 (వెబ్‌సిరీస్) - జనవరి 31
Details
ఓటిటిలో విడుదలయ్యే మూవీలివే
2. అమెజాన్ ప్రైమ్
ర్యాంపేజ్ (హాలీవుడ్) - జనవరి 26
ట్రెబ్యునల్ జస్టిస్ 2 (వెబ్‌సిరీస్) - జనవరి 27
బ్రీచ్ (హాలీవుడ్) - జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్ (హాలీవుడ్) - జనవరి 30
3. జియో సినిమా
ది స్టోరీ టెల్లర్ (హిందీ) - జనవరి 28
4. ఆపిల్ టీవీ ప్లస్
మిథిక్ క్వెస్ట్ (వెబ్‌సిరీస్) - జనవరి 29
5. సోనీలివ్
సాలే ఆషిక్ (హిందీ) - ఫిబ్రవరి 1