OTT Movies In This Week: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త వారం ప్రారంభమైంది.. కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటి వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వారాంతం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీలు రెడీగా ఉన్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ముఖ్యమైన చిత్రాలు ఇవే.
Details
రాజాసాబ్ వచ్చేస్తున్నాడు
'మన టైమ్ స్టార్ట్ అయ్యింది' అంటూ గత నెల థియేటర్లలో సందడి చేసిన అగ్రహీరో ప్రభాస్ చిత్రం 'రాజాసాబ్' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా కనిపించారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని రకాల భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్‌లో మిస్ అయినవారికి ఇదే మంచి అవకాశం.
Details
మూడు ముళ్ల కోసం తిప్పలు
ఓ వైపు కాబోయే భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఈ ఇద్దరి మధ్య నలిగిపోయిన ఓ యువకుడి కథతో రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇద్దరు భామల మధ్య చిక్కుకున్న ప్రేమికుడిగా శర్వానంద్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మూడు ముళ్ల కోసం శర్వానంద్ పడిన తిప్పలేమిటో ఓటీటీలో చూసేయొచ్చు.
Details
ఓటీటీలో వచ్చే సినిమాలివే
సైకో సిద్ధార్థ్ (చిత్రం) బుధవారం, ఆహా రిలేషన్‌షిప్ గోల్స్ (చిత్రం), బుధవారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ది లింకన్ లాయర్ 4(సిరీస్), గురువారం, నెట్ ఫ్లిక్స్ జాబ్ సిటీ(సిరీస్), శుక్రవారం, సోనీలివ్ సాల్వడార్(సిరీస్), శుక్రవారం, నెట్ ఫ్లిక్స్ నీలకంఠ (చిత్రం), శుక్రవారం, సన్ నెక్ట్స్