
upcoming telugu movies: ఈ వారం బాక్సాఫీస్, ఓటిటిల్లో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జూలై 11వ తేదీ తెలుగు, హిందీ, హాలీవుడ్ ప్రేక్షకుల కోసం సినీ పండుగలా మారబోతుంది. రొమాంటిక్ కామెడీ నుండి గ్యాంగ్‌స్టర్ డ్రామాల వరకూ పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లో కొన్ని యువతను ఆకట్టుకునేలా ఉంటే, మరికొన్ని యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా మారాయి. ఓ భామ అయ్యో రామా సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఒక యువకుడి చుట్టూ తిరిగే హాస్యం, ప్రేమతో కూడిన కథను చూపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది.
Details
ది 100
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. మిషా నారంగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నగర శివార్లలో వరుసగా జరుగుతున్న సామూహిక హత్యల వెనుక నుగ్గిన మిస్టరీని పరిష్కరించే పోలీస్ కథ చూపించనున్నారు. జూలై 11న ఈ చిత్రమూ ప్రేక్షకుల ముందుకి రానుంది. వర్జిన్ బాయ్స్ హాస్యం, రొమాన్స్, ఎమోషన్‌ల మేళవింపుతో యువతను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రంలో గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించగా, దయానంద్ దర్శకత్వం వహించారు. శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్, అన్షుల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది.
Details
సూపర్‌మ్యాన్ (హాలీవుడ్)
డీసీ యూనివర్స్‌లో మరోసారి కొత్తవైపునకు మలుపు తీసుకుంటూ వస్తున్న సూపర్‌మ్యాన్ రీబూట్ చిత్రం కూడా జూలై 11న విడుదల కాబోతుంది. డేవిడ్ కొరెన్స్‌వెట్ టైటిల్ పాత్రలో కనిపించనుండగా, జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల కానుంది. క్లార్క్ కెంట్‌గా సూపర్‌మ్యాన్ జీవన ప్రయాణం ఇందులో కీలకంగా నిలవనుంది. మాలిక్ రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'మాలిక్' (Maalik), పుల్కిత్ దర్శకత్వంలో తెరకెక్కింది. మానుషి చిల్లర్ కథానాయిక కాగా, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాతో జూలై 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Details
ఓటిటిలో విడుదల కానున్న సినిమాలివే
నెట్ ఫ్లిక్స్ ఆప్ జై సా కోయి (హిందీ) జులై 11 బ్రిక్స్ (ఇంగ్లీష్) జులై 10 సెవెన్ బేర్స్ (యానిమేషన్) జులై 10 బ్రిక్స్ (ఇంగ్లీష్) జులై 10 జియో హాట్‌స్టార్ మూన్ వాక్ (మలయాళం) జులై 08 స్పెషల్ ఓపీఎస్ (వెబ్ సిరీస్ సీజన్ 2) జులై 11 బుక్ మై షో గువ్ వన్ (హాలీవుడ్) జులై 08 సోనిలివ్ నరివెట్ట(మలయాళం) జులై 11