
NTR: జూనియర్ ఎన్టీఆర్ వదిలిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఆ చిత్రాల రేంజ్ వేరే లెవల్!
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో తన అద్భుతమైన యాక్టింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పారు.
ఆ తర్వాత 'దేవర' సినిమాతో తెలుగు తెరపై మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే తన కెరీర్‌లో ఎన్టీఆర్ కొన్ని పెద్ద బ్లాక్ బస్టర్లను వదిలేశారు.
అవి ఆయన్ని మరింత ఉన్నతమైన స్థాయిలో నిలబడేందుకు సహకరించేవని చెప్పొచ్చు. అయితే ఎన్టీఆర్ ఏ ఏ సినిమాలను వదలుకున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Details
1. కిక్
ఎన్టీఆర్ వదులుకున్న ముఖ్యమైన సినిమాలో 'కిక్' చిత్రం ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవితేజ హీరోగా నటించారు.
అయితే ఈ చిత్రాన్ని మొదట జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉంటే, అది ఆయన కెరీర్‌ని ఓ కొత్త ఎత్తుకు తీసుకెళ్లేదని చెప్పొచ్చు.
2. ఆర్య
సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'ఆర్య' సినిమాను కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ ఆ సమయంలో లవ్ స్టోరీలపై తన ఎన్టీఆర్‌కు ఆసక్తి తగ్గిపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చింది.
Details
3. భద్ర, కృష్ణ, దిల్
భద్ర, కృష్ణ, దిల్ వంటి సినిమాలు కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చినట్లు సమాచారం. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 'భద్ర'ను ఎన్టీఆర్ చేయకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు.
ఇక కృష్ణ, దిల్ వంటి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు గొప్ప కాంబినేషన్ గా చర్చలకు దారితీస్తుంది.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాలో నటించనున్నారు. అలాగే 'దేవర2' మూవీపై కూడా జోరుగా బజ్ వినిపిస్తుంది, అయితే ఈ సినిమా ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత లేదు.