Page Loader
OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న టాప్ 5 చిత్రాలు ఇవే!
ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న టాప్ 5 చిత్రాలు ఇవే!

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న టాప్ 5 చిత్రాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ మూడో వారం ఓటిటి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ వారం పలు భిన్న శైలుల సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోకి అడుగుపెడుతున్నాయి. మిస్టరీ థ్రిల్లర్‌ల నుంచి స్పోర్ట్స్ కామెడీ డ్రమా వరకు ఐదు ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. వాటిపై ఓసారి చూద్దాం. డిటెక్టివ్ షెర్దిల్ ప్రముఖ నటుడు దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన 'డిటెక్టివ్ షెర్దిల్' సినిమా జూన్ 20న జీ5లో స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లకు వెళ్లకుండానే నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌ ఓ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. రవిచబ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, చంకీ పాండే, రత్న పాఠక్ షా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

Details

గ్రౌండ్ జీరో

బీఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'గ్రౌండ్ జీరో' చిత్రం జూన్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెంటల్ విధానంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించారు. ఉగ్రవాదులపై జరిగే మిషన్ చుట్టూ కథ తిరుగుతుంది. తేజస్ ప్రభ విజయ్ దేవ్‌స్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. కొల్లా 2023లో మలయాళంలో విడుదలై మంచి స్పందన పొందిన హీస్ట్ థ్రిల్లర్ కొల్లా ఇప్పుడు జూన్ 19న తెలుగు వెర్షన్‌గా ఈటీవీ విన్లో విడుదలవుతోంది. రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్, వినయ్ ఫోర్ట్ లీడ్ పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆకట్టుకుంటోంది.

Details

ఒక పథకం ప్రకారం

తెలుగు లీగల్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం జూన్ 20న సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది. శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో న్యాయ వ్యవస్థ నేపథ్యంలో ఆసక్తికర కథనం ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది అలప్పుజ జింఖానా మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్ అలప్పుజ జింఖానా ఇప్పుడు జూన్ 20న తెలుగు వెర్షన్‌గా ఆహాలో ప్రేక్షకుల ముందుకురానుంది. స్పోర్ట్స్ కామెడీ డ్రామా నేపథ్యంలో నెస్లెన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించగా, ఖాలీద్ రహ్మాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే సోనీలివ్‌లో అనేక భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.