అవతార్ 2: ఈ పాయింట్స్ ఉండుంటే అదిరిపోయేదేమో
ఈ వార్తాకథనం ఏంటి
2009లో వచ్చిన అవతార్ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. విజువల్స్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే సహా ఈ సినిమాలో ప్రతీదీ ప్రేక్షకుడి మతి పోగొట్టింది.
ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారాంతంలో ఈ సినిమాకు 438మిలియన్ డాలర్లకు పైగా వసూళ్ళు వచ్చాయి. వారాంతాలు వదిలిపెడితే వీక్ డేస్ లో కలెక్షన్లు తగ్గినట్లు కనిపిస్తోంది.
దీనికి చాలా కారణాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అవతార్ 2 సినిమాలో విజువల్ అద్భుతంగా ఉన్నాయని, కానీ కొన్ని ముఖ్య అంశాలు ఉండుంటే అవతార్ 2 ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు.
అదిరిపోయే ట్విస్టులు: సినిమా ఆసాంతం సాఫీగా సాగుతుందే తప్పా ఎక్కడా కూడా ట్విస్ట్ కనిపించదు.
అవతార్ 2
ఈ విషయాలు అవతార్ 2 లో ఉండుంటే
విలనిజం లేకపోవడం: క్వారిచ్ క్యారెక్టర్ హీరో జేక్ సల్లీ కోసం అవతార్ లాగా వస్తాడు. అతడు జేక్ సల్లీని ఏం చేయాలనుకుంటాడు అనేది స్పష్టంగా చూపించలేదు.
విలనిజం పెద్దగా పండనపుడు హీరోయిజం తేలిపోతుంది. అవతార్ 2 లో జరిగిందదే. ఇందులో హీరో కూడా పెద్దగా ఏమీ చేసినట్టు అనిపించదు.
అనవసరమైన సీన్లు: జేక్ సల్లీ కుటుంబంలో ఒక కొడుక్కి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. మిగతా వారితో వచ్చే సీన్స్ అనవసరంగా అనిపిస్తుంది.
నేపథ్య సంగీతం: సినిమా మొత్తంలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే నేపథ్య సంగీతం ఎక్కడా వినిపించదు. జేమ్స్ కామెరూన్ అలాంటి సీన్లు రాసుకోలేదా లేక సంగీతమే అంతలా ఉందా అనేది అర్థం కాకుండా ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.