Page Loader
కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఎందుకురా బాబు పేరుతో మూడవ సాంగ్ 
రూల్స్ రంజన్ సినిమాలో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఎందుకురా బాబు పేరుతో మూడవ సాంగ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 02, 2023
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

మీటర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుండి రూల్స్ రంజన్ టైటిల్ తో సినిమా వస్తోంది. నేహాశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. నాలో నేను లేను, సమ్మోహనుడా అనే రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మూడవ పాట విడుదలకు సమయం వచ్చేసింది. తాజాగా ఎందుకురా బాబు పేరుతో మూడవ పాట రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఎందుకురా బాబు పాట ప్రోమోను ఆగస్టు 3న ఉదయం 9:03గంటలకు రిలీజ్ చేస్తున్నారు. స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఎమ్ రత్నం సమర్పకులుగా ఉన్నారు. రత్నం క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాట ప్రకటనపై నిర్మాణ సంస్థ ట్వీట్