Loading...
Deepika Padukone: ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నా బిడ్డతోనే.. దీపికా పదుకొణె ఎమోషనల్ పోస్ట్
ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నా బిడ్డతోనే.. దీపికా పదుకొణె ఎమోషనల్ పోస్ట్

Deepika Padukone: ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నా బిడ్డతోనే.. దీపికా పదుకొణె ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్న ఆమె, తన గర్భధారణకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా గర్భధారణ సమయంలో ఎక్కువ బరువు ఎత్తకూడదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇప్పటికే ఒక బిడ్డకు తల్లైన మహిళలు తమ తొలి బిడ్డను ఎత్తుకోవాల్సిన పరిస్థితి తరచూ ఎదురవుతుందని చెప్పే ఓ రీల్‌ను దీపిక షేర్ చేశారు. దానికి నా ప్రెగ్నెన్సీ ప్రయాణం అంతా ఇలాగే సాగుతోందంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటూ, అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది.

వివరాలు

కల్కి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకోని దీపిక, అప్పుడప్పుడూ ఇలాంటి పోస్టులతో అభిమానులను పలకరిస్తుంటారు.

ప్రస్తుతం ఆమె తన తొలి బిడ్డతో విలువైన సమయం గడుపుతూ, రెండో బిడ్డ రాక కోసం సిద్ధమవుతున్నారు. ఈ దశలో కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక కెరీర్ పరంగా కూడా దీపిక వార్తల్లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్'తో పాటు 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి ఆమె తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

గర్భధారణ కారణంగా తాను రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని షరతు విధించడమే ఇందుకు కారణమని సమాచారం.

ADVERTISEMENT