
JR NTR : 'ఈ అస్తిత్వం మీరు' హరికృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్) కూడా ఎమోషనల్‌గా స్పందించాడు. "ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ హృదయపూర్వకంగా రాసుకొచ్చాడు. ఆ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పేర్లు ఉంచారు.
Details
డ్రాగన్ పై భారీ అంచనాలు
హరికృష్ణ 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆయన పేరుతో అనేక సేవా కార్యక్రమాలను జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'వార్-2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో, ఇకపై మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. 'డ్రాగన్' సినిమాతో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎన్టీఆర్.