Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్‌గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక.. 'యానిమల్' మూవీతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఒక ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. శ్రద్ధా దాస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ రోజు తాము చావు నుంచి ఇలా తప్పించుకున్నామంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. రష్మిక తాజాగా ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో టేకాఫ్ అయిన 30నిమిషాల్లోనే విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండింగ్ చేశారు. బహుశా దీని గురించే రష్మిక పోస్ట్ పెట్టి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.