
Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించిన 'కన్నప్ప' సినిమా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో 'ఈమె ఎవరా?' అని చాలా మంది ఆరా తీస్తున్నారు. తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ జూలై 30, 2001న తిరుచ్చి జిల్లాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. బీటెక్ పూర్తి చేసిన ప్రీతి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించింది.
Details
డ్యాన్స్‌లలోనూ అదరగొట్టిన ప్రీతి ముకుందన్
'కన్నప్ప'కంటే ముందు ప్రీతి ముకుందన్ నటించిన మరో తెలుగు సినిమా 'ఓం భీం భుష్', ఇందులో శ్రీ విష్ణు హీరో. కానీ ఈ చిత్రంలో ప్రీతి కన్నా ఆయేషా ఖాన్ ఎక్కువ హైలైట్ అయ్యింది. అంతకుముందే ప్రీతి తమిళంలో కెవిన్ హీరోగా నటించిన 'స్టార్' సినిమాలోనూ కనిపించింది. 'కన్నప్ప' ఒక భారీ ప్రాజెక్ట్ కావడంతో ప్రీతి ముకుందన్ పేరు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో ఆమె గ్లామర్ షోకే కాకుండా డ్యాన్స్‌లలోనూ అదరగొట్టింది. విష్ణుకి జోడీగా నటించడం ద్వారా తన టాలెంట్‌ని ప్రదర్శించింది. 'కన్నప్ప' సినిమా హిట్ అయితే ప్రీతి ముకుందన్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, తమిళంలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.