LOADING...
The Raja Saab :అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న రెబెల్ సాబ్ 
అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న రెబెల్ సాబ్

The Raja Saab :అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న రెబెల్ సాబ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ప్ర‌భాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో ఆయన కొత్త సినిమా రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్‌లో మొదటిసారిగా ప్రేక్షకులకోసం తెరపైకి రానున్న ఈ సినిమా, ఈ రోజు సాయంత్రం నుండి ప్రీమియర్లతో రచ్చ రేపనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా, డార్లింగ్ ఫ్యాన్స్ కోసం కావాల్సిన ఎక్సైట్మెంట్ కూడా పూర్తిగా ఇచ్చాయి. ఇంతకుముందు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు, అలాగే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

వివరాలు 

 భారత ఏకైక నటుడుగా రికార్డ్

ఓవర్సీస్‌లో రెబెల్ సాబ్ మరిన్ని రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రీమియర్స్ ప్రారంభం కాబోయే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌ సత్తా చూపిస్తున్నాయి. ముఖ్యంగా, నార్త్ అమెరికా ప్రాంతంలో అడ్వాన్స్ సేల్స్‌ ద్వారా ఒక మిలియన్ డాలర్స్‌ను మించి రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో రెబెల్ స్టార్ మరొక రికార్డును కూడా తన పేరుతో రాశాడు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్‌లో హ్యాట్రిక్‌గా 1M$ ప్రీమియర్స్ సాధించిన ఏకైక భారతీయ నటుడుగా ఈ విజయాన్ని సాధించాడు.

వివరాలు 

మొదటి రోజే 3M డాలర్స్ పైగా కలెక్షన్లు రావచ్చని అంచనా

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో తన స్టామినా ఏంటో చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ట్రెండ్ కొనసాగితే, ప్రీమియర్స్ కలిపి మొదటి రోజే 3M డాలర్స్ పైగా కలెక్షన్లు రావచ్చని అంచనా. ఏదేమైనా రెబల్ స్టార్ ను అందుకోవడం అంటే అంత మాములు విషయం కాదనిే చెప్పాలి.

Advertisement