LOADING...
RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఇదే!
రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఇదే!

RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా 'మాస్ జాతర' అనుకున్న స్థాయిలో రాణించనప్పటికీ సినిమాలకు బ్రేక్ లేకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 76వ సినిమాలో నటిస్తున్నారు. రచన, దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'నేను శైలజా', చిత్రలహరిను రూపొందించిన కిషోర్ తిరుమల, ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్‌లో ఎమోషన్స్ కలగలిపిన పర్ఫెక్ట్ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ను రవితేజతో చేస్తున్నాడు. ఈ సినిమాకు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. సినిమా సంసార సాగరంలో భర్తలు ఎదుర్కొనే కష్టాలు, భార్య-భర్తల మధ్య వచ్చే తగాదాలు వంటి అంశాలను కథలో చూపించనుంది.

Details

వచ్చే సంక్రాంతికి రిలీజ్

రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో దర్శకుడు 'కిషోర్ తిరుమల'కి కూడా ఈ సినిమా కీలకంగా ఉంది. ఆయన గత చిత్రం 'ఆడాళ్ళు మీకు జోహార్లు' నిరాశపరిచిన తర్వాత, భర్త మహాశయులకు విజ్ఞప్తితో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సంగీతం కోసం ధమాకా, మాస్ జాతర తర్వాత హ్యాట్రిక్ సినిమాగా భీమ్స్ సిసిరోలి సమ్మతం అందిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ పూర్తి అవుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో 'SLV సినిమాస్' బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు.