Suriya: స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి.. అభిమాని పెళ్లికి హజరైన 'సూర్య'.. షాక్ అయిన వధువు!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది. తన పెళ్లికి సూర్య హాజరుకావాలనే కోరికను ఓ అభిమాని వ్యక్తం చేయగా, ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్న హీరో నిజంగానే ఆమె వివాహానికి వెళ్లి ఘనమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా సూర్యను చూసిన వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Details
అభిమానుల ప్రశంస
ఈ సీన్ చూసిన నెటిజన్లు, అభిమానులు సూర్య మంచి మనసును కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా సూర్య ఇలాంటి సర్‌ప్రైజ్‌లతో పలువురు అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలను అందించారు. తన స్టార్‌డమ్‌ను అభిమానుల ఆనందానికి ఉపయోగించుకోవడంలో సూర్య ఎప్పుడూ ముందుంటారని మరోసారి ఈ సంఘటన నిరూపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
• An Unexpected Visit From @Suriya_offl Na Made Bride Happy and Memorable 😍❤️#Karuppu #Suriya47 pic.twitter.com/G8yttRom6r
— Abhimanyu (@Abhimanyu_Offl) December 27, 2025