Loading...
this week telugu movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగ.. థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
ఈ వారం మూవీ లవర్స్ కు పండగ.. థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!

this week telugu movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగ.. థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఇటీవలి కాలంలో మనం ప్రేమకథలను చెప్పడం తగ్గించేశాం. యాక్షన్ థ్రిల్‌తో మేళవించిన కొత్త తరహా ప్రేమకథే 'డెకాయిట్‌' అని హీరో అడవి శేష్ పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా షానియల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మ హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు

2040లో సాగే ప్రేమకథ

'లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ' అనే చిత్రం భవిష్యత్తు నేపథ్యంలో రూపొందింది. ప్రస్తుతం మన జీవితం ఫోన్‌లపై ఎంత ఆధారపడుతోందో చూస్తే, 2040 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఈ కథ రూపొందించారు.

ఒక యువకుడి పెళ్లి విషయంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో, ఒక యాప్ ద్వారా పరిచయమైన ప్రేమను నమ్మగలమా? అనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్, కీర్తి శెట్టి జంటగా నటించారు. ఎస్‌జె. సూర్య, యోగి బాబు, గౌరీ కిషన్, శారా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

వివరాలు

మాస్ కథాంశంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామా

మలయాళ నటుడు టోవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న 'పల్లిచట్టంబి' చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

1950-60 దశకాల చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.

ADVERTISEMENT

వివరాలు

ఓటీటీలో వచ్చే సినిమాలు

జియో హాట్‌స్టార్‌

ది టెస్టమెంట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్ 08

ది క్లీనింగ్‌ లేడీ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 08

థాయ్‌ కిళవి (తమిళ) ఏప్రిల్‌ 10

నెట్‌ఫ్లిక్స్‌

బీఫ్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 08

అన్‌టోల్డ్‌: చెస్‌ మేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 08

తూ యాన్‌ మైన్‌ (హిందీ) ఏప్రిల్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌

నిప్పన్‌ సంగోకు (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్ 05

ది బాయ్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్ 08

ఓ రోమియో (హిందీ) ఏప్రిల్‌ 10

ADVERTISEMENT