Loading...
OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో అదిరిపోయే సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ కావొద్దు!
ఈ వీకెండ్ ఓటీటీలో అదిరిపోయే సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ కావొద్దు!

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో అదిరిపోయే సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ కావొద్దు!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారాంతంలో ఇంట్లోనే కూర్చొని మంచి సినిమాలు చూడాలనుకునే సినీప్రియులకు ప్రముఖ ఓటీటీ వేదికలు పలు కొత్త చిత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్, మర్డర్ మిస్టరీ వంటి విభిన్న జానర్లలో వచ్చిన ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

వివరాలు

'మా ఇంటి బంగారం' - జియో హాట్‌స్టార్‌లో

సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-కామెడీ డ్రామా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికపై తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వివరాలు

'మధురాపురి సదన' - ఈటీవీ విన్‌లో

వైవిధ్యభరితమైన కథలను ప్రేక్షకులకు అందిస్తున్న ఈటీవీ విన్ తాజాగా 'మధురాపురి సదన' చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.

భరత్ సాయినాథ్ వర్మ, యశూ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

డీడీ శ్రీనివాస్, నీలా ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఒక మధ్యతరగతి కుటుంబం చేసే ప్రయాణాన్ని హృద్యంగా చూపించిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

వివరాలు

'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' - జీ5లో

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన వడ్డే నవీన్, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రాశీ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.

ADVERTISEMENT

వివరాలు

'గేదెల రాజు.. కాకినాడ తాలూకా' - రెండు ఓటీటీల్లో

సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కీలక పాత్ర పోషించిన 'గేదెల రాజు.. కాకినాడ తాలూకా' చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించగా, వాణి రవికుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మర్డర్ మిస్టరీ మూవీ ఇప్పుడు రెండు ప్రముఖ ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉంది.

ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలో కూడా వీక్షించవచ్చు.

ADVERTISEMENT