ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు రెడీ ఐపోయాయి. అవేంటో చూద్దాం.
ఏజెంట్:
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. తెలుగు సినిమాకు అచ్చొచ్చిన తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో, సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ థమిజ సంగీతం అందించారు.
పొన్నియన్ సెల్వన్ 2:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఏప్రిల్ 28న విడుదల అవుతుంది. విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Details
ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు
సేవ్ ద టైగర్స్:
భార్యలకు భర్తలకు మధ్య జరిగే గొడవలన్ను కామెడీగా చూపించేందుకు వస్తోంది సేవ్ ద టైగర్స్. ప్రియదర్శి, అభినవ్ గొమఠం, చైతన్య ప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సిరీస్, ఏప్రిల్ 27నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
వ్యవస్థ:
కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సిరీస్ లో, న్యాయవ్యవస్థలోని లోపాలను చూపించబోతున్నారు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. జీ5 లో ఏప్రిల్ 28నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
దసరా:
నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచి 100కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం దసరా. ఈ నెల 27నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.
Details
అమెజాన్ లోకి వస్తున్న ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్
రుస్సో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ సిరీస్ ను ఏప్రిల్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి తెస్తున్నారు. కాకపోతే కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ అవుతాయి.
మే నెల నుండి ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఈ సిరీస్ ని తెలుగులోనూ చూడవచ్చు. ఆ వెసులుబాటును అమెజాన్ ప్రైమ్ వీడియో కల్పిస్తోంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. రాజ్, డీకే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు.