Page Loader
ఈవారం చిన్న సినిమాల హవా; ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే 

ఈవారం చిన్న సినిమాల హవా; ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే 

వ్రాసిన వారు Stalin
Aug 14, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం అన్ని చిన్న సినిమాలే థియేటర్స్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో పలు చిన్న, పెద్ద మూవీస్‌తో పాటు వెబ్ సిరిస్‌లు అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీతో పాటు, థియేటర్స్‌లో వచ్చే సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Mr. Pregnant: బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సోహెల్ లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్ '. ఆగస్ట్ 18న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. prem kumar: 'అన్నీ మంచి శకునములే' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సంతోష్ శోభన్ ఇప్పుడు మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమా ఈనెల 18న విడుదలవుతోంది.

మూవీ

'జిలేబి'తో దర్శకుడు కె.విజయ భాస్కర్ కుమారుడు హీరోగా ఎంట్రీ

Jilebi: టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించే దర్శకుల్లో కె విజయ భాస్కర్ ఒకరు. తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ భాస్కర్ తెరకెక్కించిన సినిమా 'జిలేబి'. ఈ సినిమాలో హీరోయిన్ శివాని రాజశేఖర్. ఈ మూవీ ఆగస్టు 18న థియేటర్స్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. DD returns bhootala bungalow: తమిళ నటుడు సంతానం కీలక పాత్రలో నటించిన మూవీ 'డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా'. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆగస్టు 18న ఈ సినిమా విడుదలవుతోంది. PIzza-3: పిజ్జా ఫ్రాంచైజీలో వస్తున్న చిత్రం 'పిజ్జా-3'. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా ఆగస్టు 18న తెలుగులో విడుదలవుతోంది.

ఓటీటీ

ఓటీటీలో వస్తున్న సినిమాలు

అమెజాన్‌ ప్రైమ్‌ హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 18న స్ట్రీమింగ్ ఈటీవి విన్ అన్నపూర్ణ స్టూడియో జియో తాలీ (హిందీ) ఆగస్టు 15న స్ట్రీమింగ్ గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ) ఆగస్టు 18న స్ట్రీమింగ్ మాస్క్‌ గర్ల్ (కొరియన్‌) ఆగస్టు 18న స్ట్రీమింగ్ జీ5 ఛత్రపతి (హిందీ) ఆగస్టు 15న స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌ అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ ఆగస్టు 15న స్ట్రీమింగ్ డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ ఆగస్టు 16న స్ట్రీమింగ్ గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ) ఆగస్టు 18న స్ట్రీమింగ్ మాస్క్‌ గర్ల్ (కొరియన్‌) ఆగస్టు 18న స్ట్రీమింగ్