LOADING...
Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 
ఈ వారం థియోటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్‌కు రానున్నాయి. పండగ సందడి ముందుగానే తెచ్చే ప్రయత్నంలో ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరోవైపు, ఓటీటీ వేదికలపై కూడా థ్రిల్, వినోదం పంచే కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి.

Details

 బాక్సాఫీస్‌  వద్ద రిలీజయ్యే  చిత్రాలివే

మిత్రమండలి (Mithra Mandali -నవ్వుల సందడి ప్రియదర్శి, విష్ణు ఓఐ, రాగ్ మయూర్‌, నిహారిక ఎన్‌.ఎం. ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్రమండలి'. విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నలుగురి స్నేహితులు కలిసి సరదా గడిపే అనుభూతిని పంచే సినిమా అని ప్రియదర్శి పేర్కొన్నారు. తెలుసు కదా(Telusu Kada) -ప్రేమకథ కాస్ట్యూమ్ డిజైనర్‌ నీరజ్ కోన దర్శకత్వంలో విడుదల కాబోతున్న చిత్రం 'తెలుసు కదా'. హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి. ఇది ముక్కోణపు ప్రేమకథ, పాత్రల భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని దర్శకురాలు విశ్వాసం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్: అక్టోబర్ 17.

Details

డ్యూడ్ (Dude) - ప్రదీప్ రంగనాథన్ 

తెలుగులోనూ క్రేజ్‌ సొంతం చేసుకున్న కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్'. మమితా బైజు హీరోయిన్‌, శరత్‌కుమార్‌, నేహాశెట్టి కీలక పాత్రలు. కామెడీ, ఎమోషన్స్‌ ప్రధానంగా ఈ సినిమాను కీర్తీశ్వరన్‌ నిర్మించారు. కె-ర్యాంప్ (K-Ramp) - రొమాంటిక్ కామెడీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ 'కె-ర్యాంప్'. కథానాయిక యుక్తీ తరేజా, ఇతర పాత్రల్లో నరేశ్‌, సాయికుమార్. జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది.

Details

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు 

జీ5 కిష్కింధపురి: అక్టోబర్ 17 భగవత్‌ (సిరీస్): అక్టోబర్ 17 ఆహా ఆనందలహరి (సిరీస్): అక్టోబర్ 17 అమెజాన్ ప్రైమ్ వీడియో పరమ్ సుందరి: స్ట్రీమింగ్ ప్రారంభం నెట్‌ఫ్లిక్స్ ది డిప్లొమ్యాట్ సీజన్ 3 (సిరీస్): అక్టోబర్ 16 గుడ్ న్యూస్‌: అక్టోబర్ 17