LOADING...
Movies: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కొత్త సినిమా.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కొత్త సినిమా.. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే

Movies: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కొత్త సినిమా.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 20, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ రంగంలో భారీ విజయాన్ని సాధించిన ఓ సినిమా ప్రస్తుతం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అదే 'వాళా 2'. కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు సావిన్‌ ఎస్‌.ఏ తెరకెక్కించారు. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చెబుతున్నారు. హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే విద్యార్థుల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ కథను రూపొందించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించగా, షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా ఏప్రిల్‌ 24న తెలుగులో విడుదల కానుంది.

వివరాలు

మరో కొత్త సినిమాతో వస్తున్న రఘు కుంచె..

ఇక మరోవైపు, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె ముఖ్య పాత్రలో కనిపిస్తున్న చిత్రం 'గేదెల రాజు.. కాకినాడ తాలూకా'. ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించగా, వాణి రవికుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాస్‌, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాల ఆధారంగా చూస్తే ఇది ఒక మర్డర్ మిస్టరీ కథతో రూపొందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. వీటితో పాటు 'అప్సర', 'శ్రీ ఆదిపరాశక్తి' వంటి చిన్న సినిమాలు కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

వివరాలు

ఓటీటీ వేదికలపై విడుదలయ్యే సినిమాలివే..

ఇక ఈ వారం ఓటీటీ వేదికలపై కూడా పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌ 19న 'రెసిల్‌ మేనియా' అనే స్పోర్ట్స్‌ సిరీస్‌ విడుదల కానుంది. ఆ తరువాత ఏప్రిల్‌ 21న ఇంగ్లీష్‌, తెలుగులో 'అన్‌చూజెన్‌' చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 22న 'హల్క్‌ హోగన్‌: రియల్‌ అమెరికన్‌' అనే వెబ్‌సిరీస్‌ కూడా అందుబాటులోకి రానుంది. అలాగే ఏప్రిల్‌ 23న ప్రసిద్ధ సిరీస్‌ 'స్ట్రేంజర్ థింగ్స్‌' కొత్త ఎపిసోడ్‌లు విడుదల అవుతాయి. ఏప్రిల్‌ 24న 'అపెక్స్‌: హంట్‌ ఆర్‌ బీ హంటెడ్‌' అనే చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

వివరాలు

ఆడియన్స్‌కి డబుల్ ట్రీట్..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్‌ 19న 'ఫ్రమ్‌ 4' వెబ్‌సిరీస్‌ విడుదలవుతుంది. ఏప్రిల్‌ 20న 'కెవిన్‌' అనే సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వస్తుంది. ఏప్రిల్‌ 22న 'కిల్లింగ్‌ గ్రౌండ్స్‌: ది గిల్గో బీచ్‌ మర్డర్స్‌' వెబ్‌సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ఏప్రిల్‌ 24న తమిళం, తెలుగులో 'హ్యాపీరాజ్‌' సినిమా విడుదల కానుంది. అదే రోజున 'నాటీ బిజినెస్‌' అనే మరో వెబ్‌సిరీస్‌ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 24న '24' అనే హిందీ సిరీస్‌, 'ప్రతిఛాయ' అనే సినిమా విడుదల కానున్నాయి. జీ5 వేదికపై కూడా అదే రోజు, అంటే ఏప్రిల్‌ 24న 'బ్యాండ్‌ మేళం' అనే తెలుగు చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Advertisement