upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. ఓటీటీలో కొత్త సినిమాల హంగమా!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు, ఓటిటి రీలీజులు బోలెడన్ని సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పలు ఆసక్తికర సినిమాలు నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కానున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటితో కలిసి స్వయంగా నిర్మించిన చిత్రం 'కాంత' (Kaantha) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సముద్రఖని, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1950ల మద్రాస్ నేపథ్యంతో మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ప్రతిబింబించే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఓ విశేష అనుభూతి ఇవ్వనుందని చిత్రబృందం చెబుతోంది. 'కాంత' నవంబర్ 14న విడుదల కానుంది.
Details
శివ రీ-రిలీజ్
ఇక ఇండియన్ సినీ చరిత్రలో సంచలనమైన 'శివ' (Shiva) మూవీ కూడా అదే రోజు రీ-రిలీజ్ అవుతోంది. నాగార్జున ప్రధాన పాత్రలో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలోకి రానుంది. యువతరానికి 'శివ'ని చేరువ చేయడానికి నాగార్జున స్వయంగా ప్రచారం చేస్తూ అగ్రతారలతో వీడియోలు పంచుకుంటున్నారు. వజ్రయోగి హీరోగా, సుధాకర్ పాణి దర్శకత్వంలో రూపొందిన 'సీమంతం' (Seemantham) కూడా నవంబర్ 14న విడుదల కానుంది. శ్రేయభర్తీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ టాటా నిర్మించారు. గర్భిణుల నేపథ్యంతో సాగే కొత్త కాన్సెప్ట్‌తో ఈ క్రైమ్ థ్రిల్లర్ సరికొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు చెబుతున్నారు.
Details
'జిగ్రీస్' నవంబర్ 14న రిలీజ్
హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'జిగ్రీస్' (Jigris) నవంబర్ 14న విడుదల కానుంది. కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ చిత్రం నవ్వులు పంచుతూ, అదే సమయంలో భావోద్వేగాలను ముద్రించేలా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన మరో చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu) కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నేటితరం ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యను హాస్య, భావోద్వేగాల మేళవింపుతో చూపిన ఈ చిత్రానికి మంచి ఆశలు ఉన్నాయి.
Details
'దే దే ప్యార్ దే 2' నవంబర్ 14న విడుదల
హిందీ ప్రేక్షకుల కోసం 'దే దే ప్యార్ దే 2' (De De Pyaar De 2) నవంబర్ 14న రానుంది. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. వయసులో పెద్ద వ్యక్తి, యువతీ మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులను మళ్లీ అలరించనుంది.
Details
ఈ వారం ఓటీటీలో రాబోయే చిత్రాలు/సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్ మెరైన్స్ (వెబ్‌సిరీస్) - నవంబర్ 10 దిల్లీ క్రైమ్ 3 (హిందీ సిరీస్) - నవంబర్ 13 డ్యూడ్ (తెలుగు/తమిళం) - నవంబర్ 14 అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే డేట్ (మూవీ) - నవంబర్ 12 జియో హాట్‌స్టార్ జాలీ ఎల్‌ఎల్‌బీ (హిందీ) - నవంబర్ 14 జీ5 ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) - నవంబర్ 14 మనోరమా మ్యాక్స్: కప్లింగ్ (మలయాళం) - నవంబర్ 14