LOADING...
Year Ender 2025: ఈ ఏడాది టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల జాబితా.. నిర్మాతల నెత్తిన చేతులు పెట్టించిన సినిమాలివే!
ఈ ఏడాది టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల జాబితా.. నిర్మాతల నెత్తిన చేతులు పెట్టించిన సినిమాలివే!

Year Ender 2025: ఈ ఏడాది టాలీవుడ్‌లో ఫ్లాప్‌ల జాబితా.. నిర్మాతల నెత్తిన చేతులు పెట్టించిన సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 టాలీవుడ్‌కు ఫ్లాప్‌ల సంవత్సరంగా మిగిలిపోయింది. భారీ అంచనాలు, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌తో విడుదలైన అనేక పెద్ద, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు విడుదలైన రెండో రోజుకే థియేటర్లలో ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. కొన్నిచిత్రాలు విడుదలయ్యాయన్న విషయమే ప్రేక్షకులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. మంచి బజ్ ఉన్నప్పటికీ, మౌత్ టాక్ బలహీనంగా ఉండటంతో రిలీజ్ అయిన వెంటనే కుప్పకూలిన సినిమాలు ఈ ఏడాది ఎక్కువగానే కనిపించాయి. ఈ ఏడాది 'డిజాస్టర్' అనే పదం వినగానే సినీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల మనసుల్లో కొన్ని సినిమాల పేర్లు వెంటనే మెదులుతున్నాయి. అందులో ముందువరుసలో నిలిచిన చిత్రాలు ఇవే.

Details

జటాధర (Jatadhara)

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన 'జటాధర' నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. సోనాక్షి సిన్హా తొలి తెలుగు సినిమా కావడం, ఘోస్ట్ హంటర్ కాన్సెప్ట్ ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తర్వాత చిత్రానికి మిశ్రమ స్పందన మాత్రమే లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.6 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉండగా, మొదటి మూడు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. హర్రర్ మూవీ అయినప్పటికీ మౌత్ టాక్ బలహీనంగా ఉండటంతో వసూళ్లు వేగంగా తగ్గిపోయాయి. చివరకు ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.

Details

ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) 

రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' నాలుగు వారాల థియేట్రికల్ రన్ అనంతరం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. సోషల్ మీడియాలో మంచి హైప్ ఉన్నప్పటికీ, సినిమా మొదటి రోజు కేవలం రూ.1.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు పెద్దగా పెరగలేదు. ఇండియాలో రూ.18.64 కోట్ల నెట్, రూ.21.99 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.7.2 కోట్ల గ్రాస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా రూ.29.19 కోట్ల గ్రాస్‌తో రన్ ముగించింది. రూ.42 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు కేవలం 44 శాతం మాత్రమే రికవరీ జరిగింది. దీంతో ట్రేడ్ పరంగా ఇది ఫ్లాప్‌గా నిలిచింది.

Advertisement

Details

మాస్ జాతర (Mass Jathara)

రవితేజ హీరోగా వచ్చిన 'మాస్ జాతర' కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. నాలుగు వారాల రన్ అనంతరం సినిమా కేవలం రూ.18.11 కోట్ల నెట్, రూ.21.36 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దాదాపు రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రొటీన్ కథనం, స్లో నారేషన్, ముందే ఊహించగలిగే సన్నివేశాల కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'ధమాకా' తర్వాత అదే కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందనే ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశ మిగిల్చింది. ట్రేడ్ వర్గాల ప్రకారం నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లాయి. రవితేజ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.

Advertisement

Details

కింగ్‌డమ్ (Kingdom) 

విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ చిత్రం 'కింగ్‌డమ్' భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ, చివరకు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయింది. 13 రోజుల థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల గ్రాస్, రూ.52 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.32 కోట్ల షేర్, రూ.53 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఇతర రాష్ట్రాలు కలిపి రూ.12 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ రూ.37 కోట్లు కాగా, సినిమా రూ.32 కోట్లకే ఆగిపోయి రూ.5 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ రూ.56 కోట్లు కాగా, రూ.52 కోట్ల షేర్‌తో రూ.4 కోట్ల డెఫిసిట్ నమోదైంది.

Details

హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) 

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'హరి హర వీర మల్లు' బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. ఇండియన్ బాక్సాఫీస్‌లో రూ.87 కోట్ల నెట్, రూ.102.66 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా కలిపితే మొత్తం వసూళ్లు రూ.55.27 కోట్ల వద్దే ఆగిపోయాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.126 కోట్లు ఉండగా, మొత్తం షేర్ కేవలం రూ.65 కోట్లకు పరిమితం కావడంతో సినిమా డిజాస్టర్‌గా మారింది. కథలో మంచి స్కోప్ ఉన్నప్పటికీ, స్లో నారేషన్, అంచనాలకు తగ్గని విజువల్స్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది అత్యంత ఘోరమైన వైఫల్యాల్లో ఒకటిగా నిలిచింది.

Details

కన్నప్ప (Kannappa) 

మంచు విష్ణు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'కన్నప్ప' కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.46 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇండియాలో రూ.32.93 కోట్ల నెట్, రూ.38.85 కోట్ల గ్రాస్‌తో థియేట్రికల్ రన్ ముగిసింది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు కనీసం రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటుల పాల్గొనడం కూడా సినిమాను గట్టెక్కించలేకపోయింది. బలహీనమైన కథనం, స్క్రీన్‌ప్లే లోపాలు, స్లో నారేషన్ ప్రధాన కారణాలుగా మారాయి.

Details

ఓదెల 2 (Odela 2) 

'ఓదెల'కు సీక్వెల్‌గా వచ్చిన 'ఓదెల 2' కూడా డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.5.8 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. భారతదేశంలో నికర వసూళ్లు రూ.5.6 కోట్లకే పరిమితం కాగా, మొత్తం బడ్జెట్‌లో కేవలం 22 శాతం మాత్రమే రికవరీ జరిగింది. బ్రేక్ ఈవెన్‌కు కావాల్సిన రూ.12 కోట్లకు చాలా దూరంగా నిలిచింది. నిర్మాతలు ప్రచారంలో రూ.8 కోట్ల కలెక్షన్లు అంటూ చెప్పుకున్నప్పటికీ, ట్రేడ్ వర్గాలు వాస్తవ క్లోజింగ్ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించాయి.

Details

రాబిన్‌హుడ్ (Robinhood) 

నితిన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాబిన్‌హుడ్' కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27.50 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్లు వసూలు చేయగా, నైజాంలో రూ.9.50 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10.50 కోట్లు వచ్చాయి. కర్ణాటక, ఓవర్సీస్ కలిపి రూ.4.50 కోట్లకే పరిమితమైంది. రిలీజ్‌కు ముందు అంచనాలు ఉన్నప్పటికీ, రొటీన్ కథనం, నెగటివ్ టాక్, ఇతర సినిమాల పోటీ కారణంగా కలెక్షన్లు తీవ్రంగా పడిపోయాయి.

Details

గేమ్ ఛేంజర్ (Game Changer) 

రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.186 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించింది. అయితే మిక్స్డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ.131 కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు రూ.30 కోట్లు రాబట్టింది. భారీ ఓపెనింగ్ ఉన్నప్పటికీ, బలహీనమైన కంటెంట్, స్లో నారేషన్ కారణంగా సినిమా డిజాస్టర్‌గా మారింది. భారీ హైప్‌తో ప్రారంభమైన 'గేమ్ ఛేంజర్' చివరకు అంచనాలను అందుకోలేకపోయింది.

Advertisement