
Aamir Khan: అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపులు.. చాలా భయపడ్డా : ఆమిర్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ శనివారం ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కొన్ని భయానక సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌కి మలుపు తిప్పిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రం విజయానంతరం అండర్‌వరల్డ్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. 1990లలో దుబాయ్‌లో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం వచ్చిందని చెప్పారు. ఆ ఆహ్వానం పరోక్ష బెదిరింపులు ముసుగులో ఉన్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు కొందరు వ్యక్తులు నేరుగా నా ఇంటికి వచ్చారు. వాళ్లు ఎవరో, ఎవరి తరఫున వచ్చారో చెప్పాలని అనుకోవడం లేదు. ఆ పార్టీలో పాల్గొనమని ఒత్తిడి పెట్టారు. ఎంత డబ్బయినా ఇస్తామన్నారు.
Details
నేను హాజరు కాలేనని చెప్పా
నువ్వు రావాల్సిందే.. ఇప్పటికే నీ పేరు ప్రకటించేశాం.. ఇది మా పరువు విషయమని స్పష్టంగా చెప్పారని ఆమిర్ తెలిపారు. అయితే తాను వారి మాటలకు ఏమాత్రం లోనవ్వలేదన్నారు. కావాలంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లండి, కానీ నా కోరికకు విరుద్ధంగా నేను అటువంటి కార్యక్రమంలో పాల్గొనను. ఆ కార్యక్రమానికి నేను రావను అని స్పష్టం చెప్పానని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు తాను చెప్పినదానిని గౌరవించి మళ్లీ సంప్రదించలేదన్నారు. అంతేకాదు, ఆమిర్ తన సహనటుడు సల్మాన్ ఖాన్‌తో తన అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Details
సల్మాన్ తో బంధం గురించి వివరించిన అమిర్ ఖాన్
సల్మాన్‌తో 'అందాజ్ అప్నా అప్నా'లో కలిసి పనిచేశాం. అయితే అప్పట్లో అతడు షూటింగ్‌లకు సరిగ్గా రాడు. దాంతో మా మధ్య అంతగా దగ్గరితనం ఉండదు. కానీ, నేను నా మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్నప్పుడు మానసికంగా బాగా క్షీణించాను. అప్పుడు సల్మాన్ నా ఇంటికి వచ్చి నన్ను కలిశాడు. మేమిద్దరం గంటలకొద్దీ మాట్లాడుకున్నాం. అదే మా మధ్య నిజమైన స్నేహానికి ఆరంభం అయిందని ఆమిర్ గుర్తు చేసుకున్నారు.