LOADING...
Surya : మూడు భాషలు-ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ మాస్టర్‌ప్లాన్‌తో రీఎంట్రీకి రెడీ!
మూడు భాషలు-ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ మాస్టర్‌ప్లాన్‌తో రీఎంట్రీకి రెడీ!

Surya : మూడు భాషలు-ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ మాస్టర్‌ప్లాన్‌తో రీఎంట్రీకి రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సూర్య, నటనలో ప్రయోగాలు చేయడంలోనూ, పాత్ర కోసం శ్రమ పెట్టడంలోనూ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు మంచి అభిమాన వర్గం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే 'జై భీమ్', 'సూరరై పోట్రు' వంటి కంటెంట్‌ డ్రైవన్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఈ గ్యాప్‌ను పూడ్చుకోవడం, పాత ఫామ్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం సూర్య ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

Details

పాన్ సౌత్ వ్యూహంతో సూర్య కొత్త ప్లాన్

ఇప్పటివరకు అనుసరించిన రూట్‌ను మార్చి, ఈసారి సూర్య పాన్ సౌత్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టారు. 2026లో విడుదల కానున్న తన మూడు సినిమాల కోసం మూడు భిన్న భాషల దర్శకులను ఎంచుకోవడం ఈ వ్యూహానికి నిదర్శనం. సూర్య 45: తమిళ మార్కెట్‌పై మళ్లీ ఫోకస్ మొదటి ప్రాజెక్టులో సూర్య, తమిళ దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో బాలాజీకి మంచి అవగాహన ఉంది. కాబట్టి సూర్య 45వ సినిమా ద్వారా తమిళ మాస్ సెంటర్లలో తన ప్రభావాన్ని మరోసారి నిరూపించుకోవాలని సూర్య భావిస్తున్నారు.

Details

సూర్య 46: తెలుగు నేటివిటీకే దగ్గరగా

సూర్యకు తమిళం తర్వాత అతిపెద్ద మార్కెట్ మన తెలుగు రాష్ట్రాలది. అందుకే 46వ సినిమా డైరెక్షన్‌ను టాలీవుడ్‌కు చెందిన సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి అప్పగించారు. ఈ కథ పూర్తిగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉండబోతోందని సమాచారం. దీంతో తెలుగు ప్రేక్షకులు సూర్యను మరింతగా ఓన్ చేసుకునే అవకాశం ఉంది. సూర్య 47: మలయాళ మార్కెట్‌ను లక్ష్యంగా కేరళలో సూర్యకు ఉన్న భారీ అభిమాన బేస్‌ను మరింతగా ఉపయోగించుకోవడానికి, అక్కడ 'ఆవేశం' వంటి హిట్లు అందించిన జిత్తు మాధవన్‌తో సూర్య 47వ సినిమా ఖరారైంది. మలయాళ సినిమాల్లో ఉండే నూతనత, వైవిధ్యం అదికూడా సూర్యలాంటివారి పెర్ఫార్మెన్స్‌తో కలిస్తే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం ఉంది.

Advertisement

Details

మూడు ఇండస్ట్రీలు, మూడు డైరెక్టర్లు: సూర్య మాస్టర్‌ప్లాన్

బాలీవుడ్‌ మార్కెట్‌పై కాకుండా, దక్షిణాది నాలుగు రాష్ట్రాల నేటివిటీపై దృష్టి పెట్టడం సూర్య తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం. తమిళం, తెలుగు, మలయాళం ఇలా మూడు వేర్వేరు పరిశ్రమల దర్శకులతో ఒకే ఏడాదిలో పనిచేయడం ద్వారా ఆ ప్రాంతాల ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అవ్వాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లో వరుసగా మూడు భిన్న రకాల సినిమాలతో దక్షిణాది బాక్సాఫీస్‌ను షేక్ చేసి, మళ్లీ నంబర్ వన్ రేసులోకి వెళ్లాలనేది సూర్య కొత్త వ్యూహం. ఈ సరికొత్త ప్లాన్ సూర్య కెరీర్‌కు మళ్లీ గోల్డెన్ పీరియడ్ తీసుకురాగలదో లేదో చూడాలి.

Advertisement