
Ram Gopal Varma: సమయం ముగిసింది.. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు చేరుకుని చర్యలు ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల ముందు 'వ్యూహం' సినిమా ప్రచారంలో భాగంగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు చేశారు.
దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ నాయకుడు రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్జీవీ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది.
Details
రక్షణ కల్పించలేమని స్పష్టం చేసిన హైకోర్టు
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాల్సిన ఆర్జీవీ, తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ వాట్సాప్‌లో సమాచారం పంపారు.
గడువు ముగిసినా హాజరుకాకపోవడంతో ఒంగోలు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
రాంగోపాల్ వర్మ వివాదాలు సృష్టించడం, వాటిని ఎదుర్కోవడం కొత్త విషయం కాదు. కానీ ఈసారి పరిస్థితులు ఆయనకు పెనుముప్పుగా మారాయి.
పోలీసుల చర్యలపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.