Meenakshi Chowdhury: రూమర్స్ విని అలసిపోయా.. పెళ్లిపై మీనాక్షి చౌదరి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నటి మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై మీనాక్షి స్పందించారు. 'లక్కీ భాస్కర్' చిత్రం తర్వాత తల్లి పాత్రలు చేయడానికి ఆసక్తి లేదని మీరు చెప్పారన్న వార్తలపై ప్రశ్నించగా, అలాంటి వ్యాఖ్యలు తాను ఎక్కడా చేయలేదని మీనాక్షి ఖండించారు. రూమర్స్‌ను ఎలా సృష్టిస్తారో నాకు అసలు అర్థం కావడం లేదు. నేను అలాంటి కామెంట్స్ ఎక్కడా చేయలేదు.
Details
ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం
నేను కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. కథ బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటాను'' అని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, తన పెళ్లి గురించి ఇటీవల వస్తున్న కథనాలపై కూడా మీనాక్షి స్పష్టతనిచ్చారు. ''నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఎన్నో వార్తలు చూశాను. అలాంటి రూమర్స్ విని నేను నిజంగా అలసిపోయాను. వాటిలో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను'' అని తేల్చిచెప్పారు. టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కథనాలు వెలువడ్డాయి.