LOADING...
Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
సూర్య - వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం గురించి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సూర్య 46' వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా అధికారికంగా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ ఉదయం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో సూర్య ఒక చిన్న బాబును ఎత్తుకుని, చేతిలో పాల డబ్బాతో ఎంతో క్లాస్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Details

వచ్చే ఏడాది జూలైలో రిలీజ్

టైటిల్ ప్రకటించడంతో పాటు విడుదల తేదీని కూడా నిర్మాతలు ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వేసవి తర్వాత రానున్న ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సూర్య తన మార్క్ చూపించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల 'లక్కి భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

కీలక పాత్రలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్

మలయాళ సెన్సేషన్ మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ టండన్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక మధ్యవయస్కుడి, ఓ యువతికి మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని జివి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సీతార ఎంటర్‌టైన్స్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement